ప్రసంగము-దేవునియందు భయభక్తులు కలిగియుండుట

ప్రసంగము-దేవునియందు భయభక్తులు కలిగియుండుట

దేవుని యొక్క  సందేశములు 

1.అంశము :  దేవునియందు  భయభక్తులు కలిగియుండుట 

ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్దామిదే దేవునియందు  భయభక్తులు   కలిగియుండి ఆయన  కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి  ఇదియే విధి : ప్రసంగి:12 :13    
దేవునియందు భయభక్తులు కాలిగి జీవించటం వలన  మనకు దేవుడు ఇచ్చు ఆశీర్వదములను గురుంచి  కొన్ని విషయాలు మీతో పంచుకొనుటకు ఇష్టపడుతున్నాను .
మెదటి ఆశీర్వాదం.1    ఆశీర్వదించును      “కీర్తనలు 115:13 –  13 పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల  వారిని యెహోవా ఆశీర్వదించును.”
      దేవునియందు భయభక్తులు  కలిగిన చిన్నలేమి, పెద్దలేమి, అందరినీ    దేవుడు ఆశీర్వదించును ,          ఉదాహరణకు  —అబ్రహామును దేవుడు ఆశిర్వదించుట ఆది :24: 1 అబ్రాహాము బహు కాలము గడిచిన   వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రా హామును ఆశీర్వదించెను. ,35, ,,22:12.)  2.   రక్షించును.         ” కీర్తనలు 34:7..  7 యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని    
          రక్షించును”    – దేవునియందు భయభక్తులు  కలిగినవారిని దేవుడు రక్షించును. (ఉదాహరణకు  – దానియేలు :౩:17,28.  28 ​నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు  పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నా శ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థ పరచిరి  షేద్రకు, మేషకు అబెద్నాగో . అను వారిని దేవుడు అగ్నిగుండములో నుండి  రక్షించెను .మనము దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తే,  దేవుడు మనలనుకుడా  తన చిత్తనుసరముగా  తప్పక రక్షించును .
౩. మేలులుచేయును 

Ps 31:19 నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి  యుంచిన మేలు యెంతో గొప్పదినరులయెదుట     
                నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు  సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.

Gen 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను,ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

Gen 32:12 నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్త రింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.

దేవుడు యాకోబుకు మేలులు దయచేసిన విదంగా మనకు కూడా మేలులు చేయును  కనుక మనము దేవునియందు భయభక్తులు కలిగి జివించవలెను.
4 .దేవుడు జాలిపడును, కృపచుపును

Ps 103:13 తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల  జాలిపడును.

Ps 103:17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస  రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీదPs 103:18 ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.
దేవునియందు భయభక్తులు కలిగి జీవించుట వలన ఆయన కృప మరియు  జాలి మనమీద ఉండును . 5. దీర్ఘాయువునకు కారణము 

Pro 10:27  యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట  దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును. 

Pro 14:27  అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు  ఊట అది మరణపాశములలోనుండి విడిపించును 

 దేవునియందు  భయభక్తులు కలిగినవారు చేయవలసిన పనులను గురుంచి తెలుసుకుందాం .

1 .Ecc 12:13  ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. 1.దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను
ఉదాహరణకు : కొర్నేలీ
 Act 10:2  అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు. 

26 ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన  యెడల వాని భక్తి వ్యర్థమే. 27 తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.


2 .Pro 16:6  కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు2 .చెడుతనమునుండి  తొలగిపోవలెను  ఉదాహరణకు :యోబు Job 1:1 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

Ps 97:10 యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.

….(.ఇంకా ఉంది ……………)